Tuesday, October 11, 2011

కంటి చూపు లేకపోయినా ఈ బాలుడు చూడగలడు

Filled under:


బెన్ ఈ భూమి పై కంటి చూపు లేకపోయినా ( నిజం చెప్పాలంటే అసలు కళ్ళే లేవు ) కేవలం శబ్ద తరంగాలని చిత్రాలుగా మార్చుకుంటూ ఆ చిత్రాల ఆధారంగా తన దినచర్య పూర్తి చేసుకుంటున్న ఏకైక బాలుడు.

కంటి చూపు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో అందరికి తెలుసు. తను మూడేళ్ళ వయసులో ఒక నయం చేయలేని వ్యాధి కారణంగా కంటి చూపుని కోల్పోయాడు. కానీ అతను కొంత కాలం తరువాత ఈ ప్రపంచంలో శబ్ద తరంగాల ఆధారంగా ఎదుట ఉన్న వస్తువులను , అడ్డంకులను గుర్తిస్తూ అందరిని ఆశ్చర్య పరిచాడు. తను అందరి పిల్లల లాగా సైకిల్ తొక్క గలడు, బాస్కెట్ బాల ఆడగలడు ఇంకా చాలా పనులు సహజంగా చెయ్యగలడు. ప్రస్తుతం ఈ భూమి పైన ఇలా శబ్ద తరంగాలని ఉపయోగించుకుంటూ  చూడగలిగిన ఏకైక వ్యక్తీ మన బెన్.

 ఈ రోజు సమాజంలో అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండి కూడా చాలా మంది నిరాశా నిస్పృహలతో జీవిస్తున్నారు . అస్సలు కంటి చూపు లేకుండా కూడా చాలా హాయిగా జీవిస్తున్న బెన్ లాంటి వారి జీవితం ఎంతో మందికి ఆదర్శ ప్రాయం . 




బెన్ కు సంభందించిన వీడియోను ఇక్కడ వీక్షించండి.

0 comments:

Post a Comment